రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిజర్వేన్లపై కీలక ప్రకటన చేశారు.. ఆయన మాట్లాడుతూ “చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని”ఆయన ప్రకటించారు.
అంతేకాకుండా ఈ తీర్మానం పార్లమెంట్ లో చట్టరూపం దాల్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు .రాష్ట్రంలో ఉన్న అన్ని ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాము .
చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాము . చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా, చేనేతలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తాము ‘ అని చంద్రబాబు తెలిపారు.