ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని చంద్రబాబు

YSR Congress Party
ఫేక్ న్యూస్ లను తయారుచేసే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్సై చొక్క పట్టుకున్న అధికార టీడీపీ కార్యకర్త ఫోటో ఫేక్ అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఈ ట్వీట్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలను గుప్పించింది. నువ్వు వచ్చాల రాష్ట్రంలో ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ,శాంతి భద్రతలు ,నీహామీలు అన్నిఫేక్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫేక్. ఫేక్ హామీలతో అధికారంలోకి వచ్చావు.
తీరా అవి అమలు కావని తెల్సి ఫేక్ న్యూస్ లతో కాలం గడుపుతున్నావు.. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకు షాడో యజమానివి నువ్వు .. నకిలీ గురించి ఫేక్ న్యూస్ ల గురించి నువ్వు మాట్లాడితే ఎలా ..?.. ఆ వీడియో చూస్తే ఎవరూ ఫేక్ అర్ధమవుతుంది అని వైసీపీ పార్టీ తన అధికారక ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.