తిరుపతి లడ్డూపై “ఆ లాజిక్” మరిచిన చంద్రబాబు
ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ తిరుపతి లడ్డూ .. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కలత చెందారు.సినీ రాజకీయ అందరూ ఈ అంశంపై తమదైన శైలీలో స్పందించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు విచారించింది.
విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని వ్యాఖ్యానించింది. నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా..?. సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ముఖ్యమంత్రి ప్రకటనకు సరైన ఆధారం లేదు అని ప్రశ్నించింది.. దీంతో ఆ నెయ్యి వాడటం లేదని టీటీడీ చెబుతుంది. గతంలో ఇదే కాంట్రాక్టర్ నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారు.కల్తీ నెయ్యి వినియోగం జరిగింది అని భావిస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకి తెలిపారు.
దీంతో సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ కల్తీ జరిగిందని మీరు ఎలా భావిస్తున్నారు.. ఏదైన ఆధారం ఉందా,.?. సదరు కంపెనీ నుండి వాంగ్మూలం తీసుకున్నారా.?. సెకండ్ ఓపినియన్ తీసుకున్నారా..?. మీకు మీరే కల్తీ అయిందని ఎలా నిర్ధారించుకున్నారు.. ఆధారాల్లేకుండా కోట్ల మంది మనోభావాలను ఎలా కించపరుస్తారు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మరి ఓ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి ఈ లాజిక్ గుర్తు లేకపోవడం విశేషం అని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.