హీరోయిన్ హన్సికపై కేసు నమోదు.!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. ప్రముఖహీరోయిన్ హన్సికపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.హాన్సిక పై గత నెల 18న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
తన అత్తింట్లో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ ఫిర్యాదు చేసింది.
దీంతో ప్రశాంత్, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సికలపై పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని హన్సిక డిమాండ్ చేసినట్లు ఆమె చేసిన పిర్యాదులో పేర్కొన్నారు.