బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ పడిపోతాయా..?
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం బీరు తాగితే డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది.
ఇందులో ఉండే ఆక్సలేట్ లు, ప్యూరిన్ లు మూత్రపిండాల్లో రాళ్లను అభివృద్ధి చేస్తాయని చెప్పింది. అంతేకాదు బీరు శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.