జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కూడా దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.