మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ,కర్ణాటక నుండి నోట్ల కట్టలు
త్వరలో జరగనున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వందల కోట్లు తరలించనున్నదా..?. అందుకే ఈ రెండు రాష్ట్రాల నుండే ఆ పార్టీకి చెందిన నేతలను అబ్జర్వర్లుగా నియమించిందా..?. అంటే అవుననే శివసేన(షిండే వర్గం)నేత ,కార్యదర్శి కిరణ్ పావస్కర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆర్ధమవుతుంది అని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరుగుతున్న ఎన్నికల కోసం తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల నుండి కోట్ల రూపాయలు మూటల్లో రానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులను మూసేయాలి. ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశాము. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ నోట్ల కట్టలను ట్రక్కుల్లో తరలిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఇందులో భాగంగానే ఈ ఎన్నికలకు ఆ పార్టీ అబ్జర్వర్లుగా ఆ రెండు రాష్ట్రాల నేతలను నియమిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ మహారాష్ట్రకు ఈ రెండు రాష్ట్రాల నుండే మహ వికాస్ ఆఘాడీకి ఇలాగే వచ్చాయని ఆయన అన్నారు.