గుండెపోటుతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రసమితికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైరా అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా ఉన్న బానోత్ మదన్ లాల్ గుండె పోటుతో కన్నుమూశారు..
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినందున ఇంట్లోనే ఆయన కుప్పకూలిపోయారు.. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లల్లో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ 2018, 23 ఎన్నికల్లో ఓడిపోయారు.