మహారాష్ట్ర లో అతి పెద్ద పార్టీ గా బీజేపీ..!
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది.
మహాయుతి కూటమికి నాయకత్వం వహించిన బీజేపీ 132 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది.మరోవైపు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన (SHS) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41,జేఎస్ఎస్ 2, ఆర్ఎస్జేపీ 1 కైవసం చేసుకున్నాయి.
అటు మహావికాస్ అఘాడీకి కేవలం 49 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై స్థానాలకే పరిమితం అయింది. శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (శరద్) 10, ఎస్పీ 2, PAWPOI 1 సీటు సాధించాయి. ఇతరులకు 6 సీట్లు వచ్చాయి.