శ్రీలీల కు చేదు అనుభవం…!

ఇటు అందంతో అటు అభినయంతో మరోపక్కా డాన్స్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ అర్యన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్ లో జరుగుతుంది. శ్రీలీల కూడా అక్కడే ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని హీరో కార్తీక్ ఆర్యన్ , హీరోయిన్ శ్రీలీల వస్తుండగా జనసముహాం లో కొంత మంది అకతాయిలు శ్రీలీల చేయి పట్టుకుని వెనక్కి లాగారు .
చుట్టూ బాడీ గార్డులు ఉన్న కానీ ఆ అకతాయిలు అలా లాక్కువెళ్లడం సంచలనం సృష్టించింది. వెంటనే తేరుకున్న బాడీ గార్డులు శ్రీలీలను అక్కడ నుండి సేఫ్ గా బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
