చిరు సినిమాపై బిగ్ అప్ డేట్..!

Big update on Chiru’s movie..!
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.
సినిమా కథలకు వైజాగ్ ను తాను సెంటిమెంట్ గా భావిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లను వసూల్ చేసింది.
