అఖండ -2 పై బిగ్ అప్ డేట్..!

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ గా తెరకెక్కి భారీ విజయాన్ని సాధించిన మూవీ అఖండ . ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఇటు ఆయన అభిమానులు.. అటు తెలుగు సినిమా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది. హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. క్యూట్ భామ సంయుక్త మీనన్ బాలయ్య బాబు సరసన అఖండ- 2 తాండవం పేరుతో అఖండ సీక్వెల్ లో నటిస్తున్నారు. ఇటీవల కుంభమేళ సమయంలో కొన్ని సీన్స్ తెరకెక్కించారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో మరికొన్ని సీన్స్ తెరకెక్కించారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం తాను మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. అఖండ -2 సెప్టెంబర్ నెలలో విడుదలవుతుంది. బాలయ్యతో నటించడం చాలా అనుభూతినిస్తుంది అని అమ్మడు వ్యాఖ్యానించారు.
