దేవర గురించి బిగ్ అప్డేట్

Big Update Of Devara
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కుతున్న తాజా చిత్రం ” దేవర”. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది.
ఈ మూవీ గురించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ను తెలియజేశారు. ఈ రోజు మంగళ వారం సాయంత్రం 5.04 గం.లకు దేవర సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి మరో అప్డేట్ ను తెలుపుతూ తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషాల్లో ఏ యూట్యూబ్ ఛానెల్లో ట్రైలర్ లాంచ్ చేస్తారో కూడా ఎక్స్ లో పోస్టు చేసింది.
” ప్రతీసారి ఆయన ఏం చేసినా చరిత్ర అవుతుంది. ఈ సారి ఆయన అన్ని ప్రాంతాలకు ఓ నోటీస్ పంపారు. సిద్ధంగా ఉండండి. దేవర అనే ఓ పెద్ద సునామీ బలంగా తాకనున్నది” అని మూవీ మేకర్స్ ఆ పోస్టులో రాసుకోచ్చారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా మరి ఈ రోజు సాయంత్రం 5.04గం.లకు ఆ సునామీ ను చూడటానికి..?
