మొయినాబాద్ :- కోళ్ల పందేం కేసులో ట్విస్ట్..!

Deputy, what is this..!
మొయినాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌజ్ పరిధిలోని కోళ్ల పందేల కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఈ పందేంలో బీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు పాల్గోన్నారు అని వార్తలు వచ్చాయి.దీనిపై సదరు ఎమ్మెల్సీ సైతం క్లారిటీచ్చారు.
తాజాగా ఈ కోళ్ళ పందేంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు ..తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కేపీవీ రామచంద్ర రావు సన్నిహితులు పాల్గోన్నారు అని ఓ వార్త వైరల్ అవుతుంది.
దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే స్థానిక పోలీసులు నిర్వహించిన దాడుల్లో దొరికడంతో సంబంధితాధికారులకు ఫోన్ చేసి కేవీపీ రామచంద్రరావు సన్నిహితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తప్పించారు అని కూడా ఆ వార్తల సారాంశం.
