ఓటు కు నోటు కేసులో రేవంత్ రెడ్డి కి షాక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఓటుకు నోటు కేసులో బిగ్ షాక్ తగిలింది …దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
కాగా ఈరోజు జరిగిన విచారణకు మత్తయ్య హాజరయ్యారు… అయితే ఈ కేసుకు సంబంధించిన మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.