అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్
ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా బిగ్ షాకిచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున దేశ రాజాధాని మహానగరం న్యూఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.
దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే ఈ వేడుకల్లో హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొవడమే కాకుండా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ ఈరోజు మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ వేడుకల కోసం చాత్రశాల్ స్టేడియంను ముస్తాబు చేయాలని.. లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం రాజ్‌నివాస్ సెక్రటరీ అషీశ్ కుంద్రా ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.