రోహిత్ శర్మకు బిగ్ షాక్..!

Rohit Sharma Indian cricketer
టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను ఇక నుండి టెస్టులకు బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పీటీఐ వర్గాలు తెలిపాయి.
త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్ గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
జూన్-జులైలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోతే టెస్టు సిరీస్ కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదు. ముందు జాగ్రత్తగానే ఎన్సీఏ కి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.