మాజీ మంత్రి పేర్ని నానికి భారీ ఊరట

మంగళగిరి మార్చి 7 (సింగిడి)
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే పేర్ని నానికి ఆ రాష్ట్ర హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పేర్ని నాని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఆయా గోడౌన్ల నుంచి తరలించిన కేసులో పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఏ6గా ఉన్నారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ ను చేర్చారు.. వీరిద్దరితో పాటుగా ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులను చేర్చి కేసు నమోదు చేశారు.
ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్నీ సతీమణి పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆమెకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
