ఉత్తమ్ కు భట్టీ పరామర్శ

Mallu Bhatti Vikramarka Deputy Chief Minister of Telangana
ఇటీవల తండ్రిని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు.
శనివారం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం నిన్న స్వయంగా ఉత్తమ్ ఇంటికెళ్లారు. ఉత్తమ్ తండ్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డితో డిప్యూటీ భేటీ అయ్యారు.
