మైనార్టీలకు భట్టి పిలుపు
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈసందర్బంగా పిలుపునిచ్చారు.
నాడు దివంగత సీఎం ‘వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కల్పించాము . ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత.
ప్రపంచపటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. మరో 2 దశాబ్దాలపాటు కాంగ్రెస్ అధికారం’ అని భట్టి స్పష్టం చేశారు.