నక్కతోక తొక్కిన “భాగ్యశ్రీ బోర్సే”

Bhagyashri Borse Indian film actress
భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజు రవితేజ హీరోగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కగా టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హాట్ బ్యూటీ.. కీర్తి సురేష్,రష్మికా మందన్నా, శ్రీలీల ముగ్గురు హీరోయిన్లను మిక్స్ చేస్తే బయటకు వచ్చిందా అన్నట్లు ఈ హాట్ బ్యూటీ ఈ మూవీలో ఆడిపాడింది.
నటనలో అందాల ఆరబోతలోనూ మంచి మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా ప్లాప్ తో డౌన్ అయినట్లు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ హాట్ బ్యూటీ మిస్టర్ బచ్చన్ మూవీ విడుదలకు ముందే స్టార్ హీరో విజయదేవరకొండ హీరోగా తెరకెక్కుస్తున్న VD12 చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో భారీ మెజార్టీతో తెరకెక్కుతుంది.
మరోవైపు నీలా మూవీ విజయంతో దూకుడు మీదున్న దర్శకుడు సెల్వమని సెల్వరాజు దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంపికైంది. కాంత పేరుతో తీస్తున్న ఈ మూవీ పూజ కార్యక్రమాల్లో అమ్మడు పాల్గోన్న ఫోటోలు వైరలవుతున్నాయి.. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా సైతం ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది.
హీరోయిన్ గా ఎంట్రీచ్చిన తొలి మూవీ ప్లాప్ అయిన కానీ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయిన్లు మిల్క్ బ్యూటీ తమన్నా.. చందమామ కాజల్ అగర్వాల్. తమన్నా భాటీయా హీరోయిన్ గా ఎంట్రీచ్చిన శ్రీ మూవీ ప్లాప్ అయింది. అలాగే కాజల్ అగర్వాల్ నటించి ఎంట్రీచ్చిన లక్ష్మీకళ్యాణం కమర్షీయల్ ప్లాప్ అయింది. కానీ ఆ తర్వాత వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ స్థాయికెదిగారు వీరు. తాజాగా భాగ్యశ్రీ బోర్సే తన మొదటి మూవీ ప్లాప్ అయిన కానీ ఏదోకరోజు టాప్ హీరోయిన్ స్థాయికెదుగుతారు అని అమ్మడి ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి వీడీ,దుల్కన్ లతోనైన హిట్ కొట్టి ముందుకు దూసుకోస్తుందేమో ఈ హాట్ బ్యూటీ..!
