రోజూ గుడ్డు తింటే హెల్త్ గుడ్
ఈరోజుల్లో నాన్ వెజ్ తిననివాళ్లుంటారేమో కానీ ఎగ్ తినని వాళ్లు మాత్రం అసలుండరు.. అయితే రోజూ ఎగ్ తినడం వల్ల అనేక లాభాలున్నాయి..ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
1) గుడ్లలో సమృద్ధిగా ఉండే B12 విటమిన్ ఎర్రరక్త కణాల నిర్మాణంలో సహాకరిస్తుంది
2) B12 నరాల పనితీరులోనూ కీలక పాత్ర పోషిస్తుంది
3) గుడ్లలో కన్పించే ముఖ్యమైన పోషకమైన కోలిన్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది
4) కోలీన్ ఆరోగ్యానికి కీలకంగా పని చేస్తోంది
5) గుడ్లలో ఉండే విటమిన్ ఏ రోగనిరోధక శక్తి పనితీరు,చర్మ సౌందర్యానికి పని చేస్తోంది
6) ఫోలేట్ ,గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధికి చాలా ముఖ్యమైంది
7) సెలీనియం అనేది గుడ్లలో కన్పించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్
8) లుటిన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి
9) భాస్వరం ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో సాయపడుతుంది