భూదందాల ఐలయ్యగా బీర్ల ఐలయ్య..!

ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బూదందాల ఐలయ్యగా అవతరించారని మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గొంగిడి సునీత ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూబాగోతం బట్టబయలైంది. తాజాగా ఆలేరు రెవిన్యూ తండాలో భూకబ్జాకు తెరలేపారు అని ఆమె ఆరోపించారు.
అమాయక గిరిజన భూములపై కన్ను వేసి తన అనుచరులకు ఆ భూములను కట్టబెడుతున్నాడు.1996లో పదహారు ఎకరాలను తొమ్మిది మంది గిరిజనులకు అసైన్డ్ భూములను కేటాయించారు. ఆ భూములు అమ్మడానికి కొనడానికి వీలు లేదు.
కానీ గత ఏడాది నవంబర్ లో కొన్ని ఎకరాలను ఎమ్మెల్యే ఐలయ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. వ్యవస్థలను చేతుల్లోకి లాక్కోని తన డ్రైవర్ కుమారస్వామి,పీఏ బాలరాజుకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని మాజీ ఎమ్మెల్యే సునీత ఆరోపించారు.వారిద్దరీ పేరిట జేపీఏ అయిన కొన్ని రోజులకే ఆ భూములను ఆమ్మేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.వీటిని కొన్నవారు సైతం ఆ ఎమ్మెల్యే బందువులే. దీనికి సంబంధించిన సేల్డ్ డీడ్ ను ఆమె మీడియాకు చూపించారు.
