బెడిసికొట్టిన బాబు “పబ్లిసిటీ స్టంట్”

 బెడిసికొట్టిన బాబు “పబ్లిసిటీ స్టంట్”

Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్న ప్రధాన టాక్ చేసిన చేయకపోయిన తన గురించి అనుకూల మీడియా ద్వారా నిత్యం భజన చేయించుకుంటారని. ఇది నిజం కాకపోలేదు. రాజకీయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ తో సహా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైన సరే తన గురించి తాను గొప్పలు చెప్పుకున్న చరిత్రలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అయిన సరే.. టీడీపీ పార్టీ పెట్టి దేశ రాజకీయాలనే శాసించడమే కాదు.. నిరంకుశ కాంగ్రెస్ పాలనను గద్దెను దించిన ఎన్టీఅర్ అయిన సరే .. ఆరోగ్య శ్రీ .. ఫీజు రియింబర్స్ మెంట్ తో పేద ప్రజల మన్నలను పొందిన వైఎస్సార్ అయిన సరే ఒక్క ప్రెస్మీట్ లో ఒక్కసారి కూడా తమ గురించి బాకా ఊదుకోలేదు.

కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మైకు కన్పిస్తే చాలు.. మీడియా కన్పిస్తే చాలు తాను చేసిన దానికంటే చేయంది తానే చేసినట్లు చెబుతారు.. ఊదాహరణకు నోట్ల రద్ధు దగ్గర నుండి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన అని చెప్పుకునేవరకు అన్నింటిని తానే చేశాను.. నేను లేకపోతే ఇవన్నీ లేవు.. అసలు తెలుగు వారికి ముఖ్యంగా తెలంగాణ వారికి అన్నం తినడం నేనే నేర్పిన అని చెప్పే గొప్పల వరకు బాబు ఎప్పుడు ఎలా తన గురించి గప్పాలు కొట్టుకుంటారో టీవీలు చూసే పేపర్లు చదివే వాళ్లందరికీ తెల్సు. అయితే తాజాగా అదే తరహాలో బాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ బెడిసికొట్టిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గత రెండు వారాలుగా వరదలతో.. వర్షాలతో విజయవాడ సహా పలు ప్రాంతాలు ఎంతగా ఇబ్బంది పడ్డాయో మనకు తెల్సిందే.

ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉంటూ పునరావాస కార్యక్రమాలను దగ్గర ఉండి మరి స్వయంగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.. బస్సులో.. జేసీబీలలో .. కాలి నడకన బాధితుల దగ్గరకు వెళ్లి నేనున్నాను.. ఆధైర్యపడకండి.. అన్ని విధాలుగా ఆదుకుంటాను అని భరోసానిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ ” నేను ఇంటికి కూడా వెళ్లకుండా మీకోసం.. మీకు అండగా ఉండటం కోసమే నేను ఇల్లు వదిలి బస్సులలో జేసీబీలల్లో ఉంటూ నిద్రాహారాలు మాని మీకోసం పని చేశాను ..యధతధంగా మాట జారారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ ” వరదలకు విజయవాడతో సహా బాబు నివాసం కూడా మునిగింది.. హైకోర్టు అసెంబ్లీనే మునిగింది. తన ఉంటున్న ఇల్లు మునగడం వల్ల బాబు బస్సులో ఉన్నాడు తప్పా జనాల కోసం కాదు. అదే బాబు ఏ కర్నూల్ లో.. నెల్లూరులో బస్సులో ఉండి బాధితులకు సాయం చేస్తే జనాలు నమ్మేవారు కానీ తన ఇల్లు మునగడం వల్ల పక్కనే బస్సులో ఉండి సేవ చేశాను అని నమ్మడానికి ప్రజలకు ఏమి తెల్వదా.. బాబు పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ అని అందరికి తెల్సు.. కానీ ఈసారి కూడా బాబు పబ్లిసిటీ స్టంట్ బెడిసికొట్టిందని వారు విమర్సిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *