టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ షాక్..?
భారత్ జట్టుకు చెందిన క్రికెటర్లకు బీసీసీఐ త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నదా..?. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓటమి పాలైంది భారత్. దీంతో ఈ సిరీస్ లో క్రికెటర్లందరూ ఫెయిల్ అయ్యారు.
ఇక నుండి ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చెల్లింపులు చెల్లించాలని ఆలోచిస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. దీని ప్రకారం ప్రదర్శన సరిగ్గా లేకుంటే వారి వార్షిక సంపాదనలో కోత పడనున్నది.
బీసీసీఐ తీసుకునే ఈ నిర్ణయంతో ఆటగాళ్లు జాగ్రత్తగా ఉంటారని కొందరూ మాజీ క్రికెటర్లు అంటున్నారు. మరోవైపు వారిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మరి.