బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల విషయంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెల్సిందే. ఈ అల్లర్లలో దాదాపు మూడు వందల మంది ఇప్పటివరకు ప్రాణాలను కోల్పయారు. కొన్ని వేల మంది గాయాల పాలయ్యారు అని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హాసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో హాసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్సింది. ముందుగానే ఆమె దేశం విడిచివెళ్లారు. హెలికాప్టర్ లో ఫిన్ లాండ్ ఆమె వెళ్లినట్లు తెలుస్తుంది.
మరోవైపు బంగ్లాదేశ్ లో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులు ఏకంగా ప్రధాని షేక్ హసీనా ఇంట్లో చొరబడ్డారు. మంత్రుల ఇండ్లపైకి దాడులకు దిగడమే కాకుండా నిప్పు పెడుతున్నారు. ఇంకా దేశంలో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.