బండి సంజయ్ కీలక నిర్ణయం
సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు.
నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం.
రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ అని అయన పేర్కొన్నారు.