సూపర్ స్టార్ సినిమాలో బాలయ్య…!

 సూపర్ స్టార్ సినిమాలో బాలయ్య…!

Balayya with a superstar…!

Loading

పాన్ ఇండియా సినిమా పుణ్యానా మల్టీ స్టారర్ సినిమాలు రూపొం దుతున్నాయి. స్టార్ హీరోలతో తీసే సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలతో పాటు నటులు సైతం నటిస్తున్నారు. పృథ్వీరాజ్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటించారు. ‘కన్నప్ప’లో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటుగా చాలా మంది స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

తమిళంలో వచ్చిన రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో శివరాజ్కుమార్, మోహన్లాల్ అతిథులుగా కనిపించారు. సుమారు ఆరువందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘జైలర్ 2’ నిర్మాణంలో ఉంది. ఇప్పటికే టీజర్ విడుదల చేశారు. ఇందులో ముత్తు పాండియన్ పాత్రని రజినీ మళ్లీ పోషిస్తున్నారు. సినిమా వర్గాల సమాచారం ప్రకారం ‘జైలర్ 2’లో బాలకృష్ణ నటిస్తారని అంటున్నారు. ఇది అతిథి పాత్ర అయినప్పటికీ, రజిని కాంబినేషన్లో బాలయ్య నటిస్తే క్రేజీ సినిమాగా మారుతుంది.

వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినికాంత్ పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార సందర్భంలో కూడా ఆయన విచ్చేశారు. రజినికాంత్ కు ఎన్టీఆర్ అంటే గౌరవం. ఆయన కుమారుడు బాలకృష్ణతో ఉన్న అనుబంధంరీత్య ప్రత్యేక పాత్రలో నటింపజేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ‘జైలర్ 2′ చిత్రానికి నెల్సన్ దిలీపకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర పాత్రధారుల గురించి తెలియాల్సి ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *