ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కానవసరంలేదు స్మితా జీ
దేశంలోని సివిల్ సర్వీసెస్ కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్ లో ప్రశ్నించిన సంగతి తెల్సిందే.. తన అధికారక ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందిస్తూ ” నాకు దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది.
కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? అని ప్రశ్నించారు..ఇంకొ అడుగు ముందుకేసి పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి.
వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం దుమారాన్ని రేపుతోంది. స్మితా వ్యాఖ్యలపై సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. కలెక్టర్ కావాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు స్మితా జీ అని తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
‘దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారు. స్మితకు సీఎస్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు..