జానీ మాస్టర్ కు బెయిల్..?
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. ఇప్పటికే జానీ మాస్టర్ ను జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.