ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.!

Bad news for Prabhas fans!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
ప్రభాస్ ఇతర సినిమాల షూటింగ్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ చిత్ర క్లెమాక్స్ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి.
ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై చిత్రం నిర్మాణ యూనిట్ ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.
