థమన్ కు వెన్నుపోటు..!

వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఎలా ఎవరూ తనను ఇబ్బందులకు గురి చేశారు. తాను ఎన్ని కష్టాలను ఎదుర్కున్నాడు . ఇలా పలు అంశాలపై ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ థమన్ తెలిపారు.
ఆ ఇంటర్వూలో ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరించారు. థమన్ మాట్లాడుతూ’నా కెరీర్లో నేను ఎంతోమందిని నమ్మి మోసపోయా. వారు నాకు వెన్నుపోటు పొడిచారు.
నా ఎదుట మంచిగా ఉండి.. పక్కకు వెళ్లగానే నా గురించి చెత్తగా మాట్లాడేవారు. కొందరిని నమ్మి ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. వీటన్నిటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నా. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే వెంటనే గ్రౌండ్కు వెళ్లి క్రికెట్ ఆడతా’ అని చెప్పుకొచ్చారు.
