“Jr .NTR ” దేవర పై బాబు కన్ను …..?

Babu Target Devara
దేవరపై చంద్రబాబు కన్నువేశాడా…? .ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేవర పార్ట్ – 1 విడుదల కానున్నది. ఈ క్రమంలో ఏదైన కొత్త మూవీ విడుదలైనప్పుడు దాని టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు తెలంగాణ ప్రభుత్వం ఆయా చిత్రాల నిర్మాతలకు అనుమతిస్తుంది. ఇటీవల విడుదలైన కల్కి మూవీకి కూడా ఆ అవకాశం కల్పించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకి అప్తమిత్రుడు. అందుకే ఆ విషయంలో ఎలాంటి సమస్య రాలేదు.
కానీ దేవర మూవీలో కొద్దిగా డౌటానుమానం ఇటు సినీ క్రిటిక్స్ .. అటు పొలిటికల్ క్రిటిక్స్ లో తలెత్తుతుంది. ఎందుకంటే గత కొంతకాలం నుండి జూనియర్ ఎన్టీఆర్ ఇటు బాబుకు అటు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పైగా భువనేశ్వరి పై వైసీపీ శ్రేణుల తీరుపై స్పందించకపొవడం.. స్పందించిన ఆ తీరు తమ్ముళ్ళను నచ్చకపోవడం.. బాబు అరెస్ట్ విషయంలో సైతం అలాగే వ్యవహరించడంతో టీడీపీ అధినేత బాబు మనసులో బాగా పాతుకుపోయిందంట. అంతే కాదు దివంగత హరికృష్ణ మరణానంతరం ఆ దూరం కాస్తా పెరిగిపోయింది. తాజాగా అక్కడ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు. రాజకీయంగా తన శత్రువులపై కక్ష తీర్చుకోవడం బాబుకు అలవాటే అని రాజకీయ వర్గాల్లో టాక్. కానీ సినిమా ఫరంగా వస్తే ఆ ఫీలర్ ఉంటదా ..? ఉండదా ..? అనేది డౌటు అంటున్నారు.
ఎందుకంటే సినిమా రిలీజ్ ల సమయంలో టిక్కెట్ల ధరల పెంపుపై ప్రత్యేక జీవో ఉన్న కానీ దేవర సినిమాలో బాబుకు కానీ టీడీపీకి కానీ సంబంధించిన వారు లేరు. దీంతో అప్పటికప్పుడు కూడా ప్రత్యేక జీవోలు తెచ్చి సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఏమైన మార్పులు చేర్పులు చేస్తారేమో అని ఇటు జూనియర్ అభిమానులు అటు చిత్రం మేకర్స్ భయపడుతున్నారు. ఒకవేళ బాబు పాజిటీవ్ గా తీసుకుంటే సినిమా టికెట్ల ధరలను పెంచుకోవచ్చు.. అదే టార్గెట్ చేస్తే మాత్రం సినిమా కలెక్షన్ల విషయంలో నిర్మాతలు ఆకాశం వైపు చూడటమే అని క్రిటిక్స్ చెబుతున్నారు. గతంలో బాబు పాలనలో ఇలాంటి సంఘటనలు లేవు.. కళాకారుల పట్ల సినిమా రంగం పట్ల ఒకేతీరుతో బాబు ఉంటాడు. కాబట్టి పాజిటీవ్ గానే రెస్పాండ్ అవుతారేమో అని అనుమానాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి దేవర ను బాబు టార్గెట్ చేస్తారా..? చేయరా అనేది ఓ రెండు వారాల్లో తేలుతుంది..?