బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే.. ఎంపీలు..!
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లాల అభివృద్ధి సమీక్షా సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు కొంతమంది గైర్హాజరు కావడంపై ఆయన సీరియస్ అయ్యారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రే ముఖ్య అతిథిగా పాల్గోనే సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలు హాజరు కాకపోవడం ఏంటి.. ముఖ్యమంత్రి మాట అంటే అంత లెక్కలేకుండా పోయిందా అని ఫైర్ అయినట్లు తెలుస్తుంది.
స్థానిక ఎమ్మెల్యేల.. ఎంపీల పనితీరుపై ఇంచార్జ్ మంత్రులు.. మంత్రులు బాధ్యత తీసుకోవాలి.. వారిని సరైన మార్గంలో నడిపించాలి.. కొంతమంది తమకిష్ట రీతిన వ్యవహరిస్తున్నారు.. వారిని నియంత్రించాలని బాబు హుకుం జారీ చేశారు అని ఏపీ పాలిటిక్స్ లో విన్పిస్తుంది.