బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..!

ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం.
మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది.