ఓటమి దిశగా ఢిల్లీ సీఎం..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ 1200ఓట్ల తేడాతో గెలుపొందారు..
