మీరు One Plus Phone వాడుతున్నారా..?
మీది వన్ ప్లస్ ఫోనా..?.. మీ మొబైల్ ఫోన్ 9,10మోడల్స్ కు చెందిన వన్ ప్లస్ ఫోనా..?. అయితే ఈ వార్త మీకోసమే.. మీ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్డేట్ అడుగుతుందా..?. అయితే మీరు అప్డేట్ చేస్కోకండి. ఎందుకంటే అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ సమస్య వస్తుంది.
ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి సిమ్ కార్డులు పనిచేయట్లేదని పిర్యాదు చేస్తున్నారు వన్ ప్లస్ ఫోన్ వినియోగదారులు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేస్కోవద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ కంపెనీ చెబుతుంది. గతంలో కూడా కొన్ని ఫోన్లు ఇలాంటి సమస్యనేకాకుండా స్క్రీన్ పై నిలువ గీత కూడా రావడం మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఏదైన మొబైల్ తీసుకునే ముందు వెనక ముందు ఆలోచించి తీస్కోవాలని ఇందుకేనేమో అంటారు అంతా..?