బాత్రూమ్ లోకి ఫోన్ తీసుకెళ్తున్నారా..?

Smart Phone
స్మార్ట్ ఫోన్ వినియోగం ఈ రోజుల్లో మరి ఎక్కువైపోతుంది.. ఎక్కడకి ఎందుకు వెళ్తున్నామో కనీసం సోయి లేకుండా ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఫోన్ వాడుతున్నాము.. ఇక బాత్రూమ్ లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. టవల్ లేదా షాంపూ తీసుకెళ్లడం మరిచిపోతామేమో కానీ మొబైల్ తీసుకెళ్లడం మాత్రం అసలు మరిచిపోము.
అయితే బాత్రూమ్ లోకి స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల రెండు నిమిషాల్లో కానీవ్వాల్సిన కాలకృత్యాలను నిమిషాల కొద్ది అక్కడే గడుపుతున్నారు కొందరూ. ఇలా ఎక్కువసేపు ఒకే యాంగిల్ లో కూర్చోవడం వలన మల ప్రాంతంలోని సిరలపై ఒత్తిడి పెరుగుతుంది .
ఈ విషయం గురించి ప్రముఖ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఓ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ తెలిపారు. ఫోన్ లో చూస్తూ సరైన భంగిమ లో కూర్చోకపోవడంతో మలబద్ధకం ,ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.