కొత్త మంత్రులకు శాఖలు ఇవేనా..?

 కొత్త మంత్రులకు శాఖలు ఇవేనా..?

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ఈరోజు ఆదివారం రాజ్ భవన్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు గవర్నర్ జిష్ణు దేవ వర్మ సమక్షంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే.

అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు లేబర్ అండ్ ఎస్సీ వెల్ఫేర్ శాఖ కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇంకోవైపు వాకాటి శ్రీహరికి న్యాయ, పశుసంవర్ధక శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *