ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.43,402కోట్లు
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక.. అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
గత ప్రభుత్వం ప్రజలను.. రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసింది.తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
వడ్డీలేని రుణాలు,భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. విత్తనాలు ,సూక్ష్మ పోషకాలను రాయితీలపై అందిస్తామని మంత్రి వివరించారు.