దేవర నుండి అదిరిపోయే సర్ ప్రైజ్

హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర..
దేవర నుండి ఇప్పటికే విడుదలైన పలు సర్ ప్రైజ్ లు ఫాన్స్ తో పాటు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమాలోని సైఫ్ అలీఖాన్ పాత్ర ‘భైర’కు సంబంధించిన గ్లింప్స్ వీడియో రిలీజైంది.
సైఫ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. బీజీఎం, ఫైట్ సీక్వెన్స్, లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.యువ దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
