ట్రంప్ కు సమీపంలో మరోసారి కాల్పులు

Donald Trump 45th U.S. President
అమెరికా మాజీ అధ్యక్షులు ,రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో మరోసారి కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని ఆదివారం ఆయన తన ఫామ్ బీచ్ గోల్ప్ క్లబ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. లోపల ఉన్న మాజీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ స్పష్టం చేశారు.
గతంలో జూలై నెలలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో సభలో పాల్గోన్న డొనాల్డ్ ట్రంప్ పైనే ఓ యువకుడు కాల్పులు జరిపిన సంగతి మనకు తెల్సిందే.
