ఏపీకి 75వేల కోట్ల పెట్టుబడులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పాలనలో రాష్ట్రానికి బీపీసీఎల్ టో పాటుగా మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి రాబోతోందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
అయితే డెబ్భై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టే ఆ కంపెనీ పేరేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు మంత్రిని కోరారు.. దీనికి మంత్రి భరత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
మంత్రి సమాధానమిస్తూ “‘నేను ఇప్పుడే చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వాళ్లు వలేసి పట్టుకెళ్లిపోతారు. అందుకే పేరు చెప్పదలుచుకోలేదు. అది కన్ఫార్మ్ అయిన తర్వాత చెప్తా’ అని అయన జవాబిచ్చారు