గురూజీ కి వ్యతిరేకంగా ఏకమైన మరో వర్గం…?

 గురూజీ కి వ్యతిరేకంగా ఏకమైన మరో వర్గం…?

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు… డైలాగ్స్ చెప్పారంటే విన్నవాళ్ళు ఎవరైన సరే ఫిదా అవ్వాల్సిందే.. వేదాంతం అయిన.. ఉపదేశమైన… ప్రేమ గురించి అయిన కుటుంబం గురించి అయిన అంశం ఏదైన సరే ఆయన చెప్పారంటే ఆ వ్యాఖ్యలకు.. మాటలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అందరూ గురుజీ అంటారు. తాజాగా జానీ మాస్టర్ ఇష్యూతో మరోసారి గురుజీ అంశం తెరపైకి వచ్చింది.

నటీ పూనమ్ కౌర్ నాలాంటి ఎంతోమంది నటీమణుల జీవితాలను ఆగమాగం చేశారు. నా జీవితం ఆగమవ్వడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం అని గతంలో పలుమార్లు ఆరోపణలు చేసింది. తాజాగా ట్విట్టర్ లో త్రివిక్రమ్ పై పిర్యాదు చేస్తే దాని స్టేటస్ ఏంటని మరోసారి బాంబ్ పేల్చింది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యతిరేక వర్గం అంతా కల్సి పూనమ్ కౌర్ ను కల్సి ఈ విషయాన్ని ఫిల్మ్ చాంబర్ లో తేలుస్తాము.. మీరు గమ్మున ఉండండి.. మీకు తప్పకుండా న్యాయం చేస్తాము అని భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ వలన తమకు చాలా మందికి అవకాశాలు రాలేదు. ఆయన చెప్పినట్లు ఓ స్టార్ హీరో వినడం.. ఆయన మిగతావాళ్లకు డైరెక్షన్స్ ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో నటుల దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు చాలామందికి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి అని .. ఒకరికి ఒకరికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. ఇప్పుడు అవకాశం చిక్కింది పూనమ్ రూపంలో.. కక్ష తీర్చుకోవాలని ఉవ్విరుళ్లుతున్నారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు విన్పిస్తున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *