తెలంగాణలో మరో కొలువు జాతర
తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల టీచర్ల భర్తీ కోసం మెగా డీఎస్సీ వేశాము.
పరీక్షలు కూడా నిర్వహించాము.. రేపో మాపో వాటి నియామకాల ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తాము.. మరో ఆరు వేల ప్రభుత్వ కోలవుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తాము.. ప్రభుత్వ స్కూల్స్ లో మౌళిక సదుపాయల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాల మహిళలకు అప్పగిస్తాము అని అన్నారు..