నాని మూవీకి అనిరుధ్..!
నేచూరల్ స్టార్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ గా యువసంచలనం అనిరుధ్ రవిచందర్ ఖరారయ్యారు.
మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది.
నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.