ఆనందంలో అనన్య..! కారణం అదేనా..?

Ananya Nagalla Tollywood Actor
అనన్య నాగళ్ల అందం అభినయం కలగల్సిన హాటెస్ట్ బ్యూటీ.. వకీల్ సాబ్ నుండి రేపో మాపో విడుదల కానున్న పొట్టేలు వరకు సరైన కథను ఎంచుకుంటూ కథకు తగ్గట్లు పాత్రలో నటిస్తూ అందర్ని మెప్పిస్తున్న యువ హీరోయిన్.. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఖమ్మం ,విజయవాడ వరదబాధితుల కోసం ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించింది ఈ బ్యూటీ..
దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తామే తోపులం.. స్టార్ హీరోయిన్లం.. కోట్లాది రూపాయలను పారితోషకం తీసుకుంటున్న కానీ ఏ ఒక్క హీరోయిన్ కూడా పైసా కూడా విరాళం ప్రకటించలేదు. కనీసం అనన్య నాగళ్ల ను చూసైన నేర్చుకోండి అని నెటీజన్లు ఈ అమ్మడును ఆకాశానికెత్తుతూ మిగతా హీరోయిన్లపై ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఈ తరుణంలో తన అభిమాన హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనన్య నాగళ్ల చేసిన పనిని మెచ్చుకుంటూ అభినందించారు.. దీంతో హీరోయిన్ అనన్య నాగళ్ల ఆనందంతో ఉబ్బితబ్బి అవుతున్నారు. అభిమాన హీరో నుండి అభినందనలు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయనే నాకు స్ఫూర్తి. అలాంటిది ఆ హీరోనే నన్ను మెచ్చుకోవడం ఆనందంగా ఉంది అని తెగ సంబురపడుతుంది.