సరికొత్తగా అల్లు అర్జున్..!

Allu Arjun in a new way..!
పుష్ప , పుష్ప – 2 పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సూపర్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బన్నీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ కొత్త సినిమా సినీ ప్రేక్షక దేవుళ్లందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని అంటున్నారు ఆ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 28న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేప థ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ – త్రివిక్రమ్ల ప్రాజెక్ట్పై నోరు విప్పారు నాగవంశీ. “తెలుగు చిత్ర పరిశ్రమ పౌరాణిక చిత్రాల్ని నిర్మిం చడం ఎందుకు ఆపేసిందో నాకర్థం కావడం లేదు. ప్రస్తుతం మేము అల్లు అర్జున్ త్రివిక్ర -మ్లతో నిర్మించనున్న సినిమా ఓ భారీ పౌరా ణిక చిత్రంగానే ఉండనుంది.
మన పురాణాల్లో ఎవరికీ అంతగా తెలియని ఓ కథతో రూపొం దించనున్నాం. అలాగని ఇది పూర్తిగా ఫిక్షనల్ పాత్రేమీ కాదు. పురాణాల్లోని ఆ దేవుడు గురించి అందరికీ పరిచయమున్నప్పటికీ.. తన జీవితంలో ఏం జరిగిందన్నది ఎవరికీ అంతగా తెలియదు. ఆ కోణాన్నే మేము ఈ చిత్రంలో భారీ స్కేల్లో చూపించనున్నాం. కచ్చితంగా ఈ సినిమా స్థాయిని చూసి భారతదేశం మొత్తం ఆశ్చర్యపోతుంది” అని చెప్పారు నాగవంశీ.