తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమా టికెట్ ధరలపై చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాము.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని మేము ఎవర్ని అడగలేదు.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి..
టికెట్ ధరలు రూ.50 పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాము. మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది.. తెలంగాణలో టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగాయి.. తండేల్ బెనిఫిట్ షోలు లేవు, అంత బెనిఫిట్ మాకు వద్దు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.