రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

తెలంగాణలోని వరంగల్-కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో సెప్టెంబర్ -అక్టోబర్ నెల మధ్యలో 94 రైళ్లను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మొత్తం 41 రైళ్లను దారి మళ్లించనున్నారు..మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది.ఈ రెండు స్టేషన్ ల మధ్య ఫోర్ లైన్ నిర్మాణం జరుగుతుంది …
దీంతో రద్దైన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-కాగజ్నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్-బల్లార్ష తదితర రైళ్లు ఉన్నాయి.